26 Nov 2011

dead sea

http://royalloyal007.blogspot.in/2011/10/legend-lenin.html
చేప‌లు నీటిలో జీవిస్తాయి. ప‌క్షులు గాల్లో ఎగురుతాయి. జంతువులు భూమిపైన మ‌న‌గ‌ల్గుతాయి. నీటిలోనూ, భూమిపైన జీవించేగ‌ల్గే ఉభ‌య‌చ‌రాలు తాబేళ్ల త‌ర‌హా జీవులూ ఉన్నాయి. మ‌నుషులు నీటిపైన‌, గాల్లోనూ ప్ర‌యాణించ‌గ‌ల‌రు. వివిధ సాధ‌నాలు,వాహ‌నాలు అందుకు అవ‌స‌రం. ఈత నేర్చి సప్త స‌ముద్రాల్లో రికార్డులు సృష్టించిన వారూ ఉన్నారు. యోగా సాధ‌న‌ను ఈత‌కు జ‌త చేసి నీటిలో తేలియాడే వ్య‌క్తుల్ని చూసిన సంద‌ర్భంలో మ‌నం ఆశ్చ‌ర్యానికి గుర‌వుతుంటాం. మ‌రి ఏ ఈత‌,యోగా,ఇత‌ర ప‌రిక‌రాలు, వాహ‌నాలు ఏవీ లేకుండా నీట్లో తేలుతూ పేప‌ర్ చ‌దివ‌డం, క‌బుర్లాడుతూ కేరింత‌లు కొట్ట‌డం య‌మా మ‌జాయే క‌దూ! ఆ య‌థార్థ‌మే ఇది. అదే..ఈ డెడ్ సీ. ఇజ్రాయిల్, జోర్డాన్ దేశాల మ‌ధ్య నెల‌కొందీ స‌ముద్రం.
డెడ్ సీ : భూమండ‌లం మొత్తం మీద అతి త‌క్కువ ప‌రిధిలో విస్త‌రించిన స‌ముద్ర‌మిది. కేవ‌లం 1300 అడుగుల(400 మీట‌ర్లు) స‌ముద్ర‌మ‌ట్టంతో 377 మీట‌ర్ల లోతు క‌ల్గినదిది. నిజానికి ఈ స‌ముద్రం ఓ స‌ర‌స్సు. జోర్డాన్ న‌దీ జ‌లాలు, జోర్డాన్, ఇజ్రాయిల్ ప‌ర్వ‌త‌శ్రేణుల నుంచి జాలువారిన వ‌ర్ష‌పు నీరే ఈ స‌ముద్ర‌పు జ‌ల‌వ‌న‌రు.దీనికి ప్రాచీన నామం అమోర స‌ర‌స్సు. ఆధునిక కాలంలో లిసాన్ స‌ర‌స్సుగా పేరు. ఈ డెడ్ సీలో 30% ఉప్పు నీరే. ప్ర‌పంచంలో ఇత‌ర స‌ముద్రాల‌తో పోలిస్తే దీంట్లోని ఉప్పుశాతం దాదాపు 9% ఎక్కువ. అందుకే ఈ జ‌లాల్లో ఏజ‌లా చ‌రాలు జీవించ‌లేవు. స‌ముద్ర‌గ‌ర్భంలో సైతం ఏ మొక్క‌లు బ‌త‌క‌వు. అందుకే దీనికి డెడ్‌సీ (మృత స‌ముద్రం)గా పేరు. షేల్‌,క్లే,శాండ్ స్టోన్‌,రాక్‌సాల్ట్‌,జిప్సంల స‌మ్మిళ‌త‌మైన జ‌లాల స‌మాహార‌మీ స‌ముద్రం. అందుకే ఏ జీవి ఇందులో బ‌త‌క‌లేదు. కానీ మ‌నుషుల‌కు మాత్రం ఈ స‌ముద్రం పెద్ద ఆహ్లాదం. ఈ స‌ముద్ర‌పు మ‌ట్టి, గాలి కూడా మ‌న‌కు ఆరోగ్య‌దాయ‌క‌మే.ఈ స‌ముద్ర‌పు గాలిలో ఆక్సిజ‌న్ శాతం మెండు.ఇక్క‌డ మ‌ట్టి కొన్ని రోగాల‌కు చ‌క్క‌టి మందు.అదే ఈ స‌ముద్ర‌తీరానికో క‌ళ తెచ్చింది. ఏటా జోర్డాన్‌, ఇజ్రాయిల్ దేశాల్లో గ‌ల ఈ స‌ముద్ర తీరం పెద్ద సంఖ్య‌లోసంద‌ర్శ‌కుల్ని ఆక‌ర్షిస్తోంది అనేక రిసార్టులు, స్పాల‌కు వేదిక‌గా నిలుస్తోంది. ఈ స‌ముద్రంలో పైకి క‌నిపిస్తోంది జ‌ల‌మే అయినా అదో ర‌సాయ‌న స‌మ్మేళ‌నం. ఈ ముడి ర‌సాయ‌నాల్ని, మ‌ట్టిని విదేశాలు దిగుమ‌తి చేసుకుంటుంటాయి. అగ్రిక‌ల్చ‌ర్,మెడిసిన్స్,కాస్మోటిక్స్ త‌యారీలో ఈ జ‌లాల్ని ఉప‌యోగిస్తుంటారు.ఇక్క‌డ మ‌ట్టిపూత‌తో సోరియాసిస్;ఆర్థ‌రైటిస్‌,రినోసినుసిల‌స్ త‌దిత‌ర బాధ‌ల నివార‌ణ‌కు బాగా ఉప‌క‌రిస్తుంది. ముదురు నీలి రంగులో ఉండే ఈ డెడ్‌సీ 1980 త‌ర్వాత నుంచి ఎర్ర‌బారింది. ల‌వ‌ణ సాంద్ర‌త అత్య‌ధికంగా ఉండ‌డం వ‌ల్ల సాల్ట్‌సీగానూ పేరొందింది. జోర్డాన్‌,ఇజ్రాయిల్ దేశాల తీరాల్లో స్పాలు కోకొల్ల‌లు. ఇవి పెద్ద సంఖ్య‌లో సంద‌ర్శ‌కుల్ని, రోగ బాధితుల్ని అల‌రిస్తూ మూడు పువ్వులు, ఆరు కాయ‌లుగా వ‌ర్ధిల్లుతున్నాయి. 
జీస‌స్ న‌డిచిన స‌ముద్రం: ఏసు సొడం,గొమార్హ్ ప‌ట్ట‌ణాల గుండా ప‌య‌నిస్తూ ఒక సంద‌ర్భంలో గెలిలీ స‌ముద్రంపై న‌డిచిన‌ట్లు క్రైస్త‌వులు విశ్వ‌సిస్తారు. ఈ ప్రాంత సంద‌ర్శ‌న‌కు అరిస్టాటిల్‌,కింగ్ సొల్మ‌న్‌, షెబారాణి,క్లియోపాత్ర త‌దిత‌రులు వ‌చ్చిన‌ట్లు ప‌లు క‌థ‌నాలున్నాయి. అయితే ఈ జ‌లాల్లోకి నేరుగా దిగి ఈత కొడితే ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌నే హెచ్చ‌రిక‌లు చేస్తుంటారు. ఇక్క‌డ ఓ సినిమా షూటింగ్‌కు వ‌చ్చిన సమ‌యంలో అప్ప‌టి హాలివుడ్ న‌టుడు సిల్వ‌ర్‌స్టెర్ స్టాలెన్ ఇందులో జ‌ల‌కాలాడిన కొన్నేళ్ల‌కు ఆసుప‌త్రి పాల‌య్యాడ‌నే ప‌లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.
ఓల‌లాడించే జ‌లాలు: ఊహాల్లో విహ‌రించిన‌ట్టే ఈ డెడ్‌సీకి సంబంధించి కొన్ని తీరాల్లో హాయిగా అలా అలా తేలిపోవ‌చ్చు.ప‌డుకొని పేప‌ర్ చ‌దివేయొచ్చు.కొంత దూరం వ‌ర‌కు ఎటువంటి ప్ర‌త్యేక సాధ‌నాల్లేకుండా న‌డిచిపోవ‌చ్చ‌ట‌.అత్య‌ధిక ల‌వ‌ణాల సాంద్ర‌త వ‌ల్ల ఏర్ప‌డిన ఉప్పు తెట్టుల‌పై ఇది సాధ్య‌మేన‌ట‌.అంతేకాకుండా ఈ నీటిపై మ‌నిషి ఓ కార్క్‌(బెండు) మాదిరిగా  తేలిపోతాడ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు.
.................................................................
రంగుస‌ముద్రాలు
^ రెడ్ సీ: ఈజిప్టు,సుడాన్‌,ఎర్త్రియా,సౌదీ అరేబియా,యెమ‌న్‌
^ యెల్లో సీ: చైనా,ఉత్త‌ర‌కొరియా,ద‌క్షిణ‌కొరియా
^ బ్లాక్ సీ: ట‌ర్కీ,బ‌ల్గేరియా,రొమేనియా,ఉక్రేయిన్‌,ర‌ష్యా,జార్జియా
^ వైట్ సీ: ర‌ష్యా

No comments:

Post a Comment

Popular Posts

Wisdomrays