15 Nov 2011

LI(TIGER)ON



http://royalloyal007.blogspot.in/2011/11/cannibals.html
సృష్టి అద్భుతం...ప్ర‌తిసృష్టి మ‌హాద్భుతం...స‌హ‌జ సిద్ధ‌మైన ప్ర‌కృతినే ప్ర‌తిసృష్టి చేస్తున్న మాన‌వమేధ‌కు న‌క‌ళ్లు ఎన్నో. అవి జంతువుల్లోనూ చొప్పించి చూపుతున్న అబ్బురం వ‌ర్ణ‌నాతీతం. ముఖ్యంగా వ‌న్య ప్రాణులైన పులులు, సింహాలు క‌ల‌గ‌లిసి విభిన్న రూపులో మ‌న‌కిప్పుడు క‌నిపిస్తున్న లైగ‌ర్‌, టైగ‌న్‌లు క‌చ్చితంగా అద్భుతాలేగా! పాంథ‌ర్ లియో జాతికి చెందిన మ‌గ‌సింహం, పాంథ‌ర్ టైగ్ర‌స్ జాతి ఆడ‌పులుల క్రాస్‌బ్రీడింగ్ ద్వారా రూపుదిద్దుకున్నవే లైగ‌ర్లు. క్రూర‌మృగాలైన సింహాలు, పులులు జ‌త క‌ట్ట‌డం స‌హ‌జ‌సిద్ధంగా జ‌రిగి ఉండొచ్చు, ఉండ‌క‌పోనూ వ‌చ్చు. కానీ సింహం త‌ల, పులి చార‌ల‌తో క‌నిపించే ఓ విభిన్న జంతువును జూ ల్లో చూడ్డ‌మ‌న్న‌ది నిజంగా  ఓ వింత అనుభూతే. 19వ శ‌తాబ్దంలోనే ఈ విభిన్న జంతువుల ఉనికి భార‌త్‌లో ఉంద‌ట‌. అంత‌కు ముందే పాశ్చాత్య‌ దేశాల్లో ఈ త‌ర‌హా జంతువుల్ని ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచిన‌ట్లు ప‌లు క‌థ‌నాలున్నాయి. 1837లో విలియం4, విక్టోరియా మ‌హారాణిల ఎదుట రెండు లైగ‌ర్ పిల్ల‌ల్ని సృష్టిక‌ర్త హెగ‌న్‌విక్ ప్ర‌ద‌ర్శించారు. మ‌గ సింహం, ఆడ‌పులికి పుట్టినవి లైగ‌ర్ల‌యితే, మ‌గ‌పులి, ఆడ సింహానికి పుట్టిన‌వి టైగ‌న్లు. వీటిలో మ‌ళ్లీ లిటిగ‌న్లు, టిలిగ‌ర్‌, లిలిగ‌ర్ల‌నే ర‌కాలూ ఉన్నాయి.
ఇవ‌న్నీ హైబ్రీడ్ నుంచి హైబ్రీడ్‌గా ఉద్భ‌వించే విభిన్న జీవులు. అయితే వీటి పున‌రుత్ప‌త్తికి సంబంధించి జంతు శాస్త్ర‌వేత్త‌లు ప‌లు ప‌రిశోధ‌నాంశాల్ని వెల్ల‌డించారు. 
లాంగ్ లివ్‌...రికార్డులు
ఈ హైబ్రీడ్ జంతువుల్లో కొన్ని స్టెరైల్‌, మ‌రికొన్నిఫెర్ట‌ల్ సామ‌ర్థ్యాన్ని క‌ల్గి ఉంటాయి.త‌ద్వారానే మ‌ళ్లీ ప‌లు ర‌కాల హైబ్రీడ్ జీవులు రూపుదిద్దుకున్నాయి. లైగ‌ర్ల సంఖ్య‌తో పోలిస్తే టైగ‌న్ల‌ సంఖ్య బాగా త‌క్కువ‌. ఈ విభిన్న జీవులు స‌హ‌జ జీవులైన సింహాలు, పులుల‌క‌న్నా బ‌లిష్టంగా పొడ‌వు ఎక్కువ‌గానూ ఉంటాయ‌ని క్రిప్టో జువాలజిస్టులు పేర్కొంటున్నారు. అడ‌విలో స‌హ‌జ‌సిద్ధ వాతావ‌ర‌ణంలో స్వ‌యంగా వేటాడుతూ పెరిగిన లైగ‌ర్ల‌యితే 10 అడుగుల పొడ‌వు దాదాపు 350 కేజీల బ‌రువుతో దృఢంగా ఉంటాయి. వివిధ ప్ర‌పంచ ప్ర‌సిద్ధ జూ ల్లో ఉన్న లైగ‌ర్లు గిన్నీస్ రికార్డుల‌ను సైతం సొంతం చేసుకున్నాయి.  మియామిలోని జంగిల్ ఐలాండ్ థీమ్ పార్కులోగ‌ల 3 ఏళ్ల లైగ‌ర్‌(ఇక్క‌డ హెర్క్యుల‌స్‌గా పిలుస్తారు) ఇదే విధంగా రికార్డు సొంతం చేసుకుంది. భూమ్మీద జీవిస్తున్న పిల్లి జాతికి చెందిన అతి పెద్ద జంతువుగా పేరొందింది. దీని బ‌రువు 410 కేజీలు కావ‌డ‌మే ఆ రికార్డు. ఇది పూర్తి జీవిత‌కాలాన్ని పూర్తి చేసుకుంద‌ని 2005లో అండ‌ర్స‌న్ కూప‌ర్ త‌న ఆర్టిక‌ల్‌లో పేర్కొన్నారు. సాల్ట్‌లేక్ సిటీలోని హొగ‌ల్ జూలో 1924 మే 14న‌ జ‌న్మించిన ష‌స్టా అనే లైగ్రెస్‌(ఆడ లైగ‌ర్‌) 1948 వ‌ర‌కు 24 ఏళ్ల‌పాటు జీవించింది. బ్లామ్‌ఫాంటీన్‌(సౌత్ ఆఫ్రికా)జూలో 1888లో పుట్టిన మ‌గ లైగ‌ర్ ఆరేళ్ల వ‌య‌సుకి 798 కేజీల బ‌రువుకు చేరుకుంద‌ట‌. అయితే ఈ వార్త నిర్ధార‌ణ కాలేదు. ఈ లైగ‌ర్ 18 ఏళ్లు జీవించింది. విస్కోసిన్‌లోని కింగ్స్ యానిమ‌ల్ సాంక్చ‌రీలో 1953లో పుట్టిన నూక్ అనే లైగ‌ర్ 550 కేజీల బ‌రువుతో 21 ఏళ్ల‌పాటు జీవించి 2007లో క‌న్నుమూసింది. 410 కేజీల‌ బ‌రువుగ‌ల హోబ్స్ మ‌గ లైగ‌ర్ సియ‌ర్ర స‌ఫారీ జూ (రెనో, నెవ‌డా)లో 15 ఏళ్ల‌పాటు బ‌తికింది. లివ‌ర్ సంబంధ‌ వ్యాధి కార‌ణంగానే ఇది చ‌నిపోయింద‌ట‌. ఒక‌జాతి జంతువు మ‌రో విభిన్న జాతి జంతువు క్రోమోజోమ్‌ల‌తో ఫ‌ల‌దీక‌ర‌ణ చేయ‌డ‌మ‌నే ప‌ద్ధ‌తే హెటెరోజెనిటిక్. ఈ విధానం ద్వారా తెల్ల‌పులి, తెల్ల సింహం ద్వారా తెల్ల లైగ‌ర్ల సృష్టి సాధ్య‌మే.  
అలిపోర్ జులాజిక‌ల్ గార్డెన్స్‌
ఇండియాలోని కోల్‌క‌తాలోని ఈ జూ 250 ఏళ్ల నాటి చ‌రిత్ర గ‌ల‌ది. ఇక్క‌డ 1971, 73ల్లో రెండు టైగ‌న్లు సంద‌ర్శ‌కుల్ని అల‌రించేవి. 1971లో రుద్రాణి, 1973లో రంజిని అనే పేర్లు గ‌ల‌ ఈ టైగ‌న్లు త‌మ పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చాయి. ఈ జూ లో ఇవే  చివ‌రి టైగ‌న్లు. రుద్రాణి 7 లిటిగ‌న్ల‌కు జ‌న్మ‌నిచ్చింది. 1991లో రుద్రాణి చ‌నిపోగా 1999లో రంజ‌ని క‌న్నుమూసింది. టైగ‌న్ల  ప్ర‌పంచం మొత్తం మీద కేవ‌లం జ‌పాన్‌, ఇట‌లీల్లోని జూ ల్లో మాత్ర‌మే ప్ర‌స్తుతం క‌నిపిస్తున్నాయి. ఇందులో నేష‌న‌ల్ జూ అండ్ అక్వారియం(కాన్‌బెర్ర‌) ఒక‌టి కాగా ఒహియో పార్క్ జూ (సాండుస్కి ఒహియో) లోను వీటిని చూడొచ్చు. 1969 నాట‌కి మాత్రం ఇక్క‌డ కేవ‌లం నాలుగే టైగ‌న్లుండేవి. లైగ‌ర్ల‌యితే ప్ర‌పంచంలో పేరొందిన తైవాన్ జూ, సియ‌ర్ర స‌ఫారీ,షాంబ్‌ల ప్రిజ‌ర్వ్‌, నోహ‌స్ ఆర్క్ జూ, పిన్ మౌంట్ జార్జియా యానిమ‌ల్ స‌ఫారీ, మ్యూనిచ్ హెల‌బ్ర‌న్ జూ ల్లో మ‌నం చూడొచ్చు. 1980లోనే గిర్ (ఇండియా) అడ‌వుల్లో లైగ‌ర్ల హైబ్రీడ్‌ ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించిన‌ట్లు మిన్సుట జూ డైరెక్ట‌ర్ రోనాల్డ్ పేర్కొన్నారు.
లైగ‌ర్ల‌కు పాలిచ్చిన కుక్క‌
చైనాలోని జిజ్కీ జూలో 2011లో రెండు లైగ‌ర్ కూన‌ల‌కు ఓ కుక్క‌పాలిచ్చి సాకుతున్న‌ వైనాన్ని బీబీసీ స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌ల ప‌లు వార్తా సంస్థ‌లు ఫొటోల‌తో స‌హా క‌థ‌నాల్ని ప్ర‌సారం చేశాయి.
----------------------------------------------------------------------------------------------
Legend Lenin post see from this blog on october 25

No comments:

Post a Comment

Popular Posts

Wisdomrays